చమురుకు ప్రత్యామ్నాయంగా గ్యాసోలిన్ !

Telugu Lo Computer
0


అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చమురుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 20 శాతం గ్యాస్ ఇథనాల్ మిశ్రమంతో గ్యాసోలిన్ తయారీకి శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా దీనిని అమలులోకి తీసుకువచ్చి 2025-26 వరకు వినియోగంలోకి తీసుకువచ్చేలా కేంద్రం ప్లాన్ చేసినట్టు తెలిసింది. దీని ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో 500 బిలియన్ ఇండియన్ రూపాయలు ఆదా చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో (85శాతం) నిలిచింది. క్రమంగా చమురు ధరలు పెరుగుతుండటంతో దిగుమతి బిల్లును తగ్గించుకోవాలని భారత్ ఆలోచన చేసింది. ఇప్పటికే గత మూడు నెలల నుంచి 10.5 శాతం ఇథనాల్ మిక్సింగ్ గ్యాసోలిన్ ను భారత్ తయారు చేస్తున్నట్టు సమాచారం. దేశంలో కొవిడ్, వేడి గాలుల తీవ్రత వలన ప్రజలు సొంత వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతుంటంతో గ్యాసోలిన్‌కు ఇప్పటికే అధిక డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా మే నెలలో 14శాతం గ్యాసోలిన్‌కు డిమాండ్ పెరిగిందని కేంద్రం ప్రకటించింది. దేశీయంగా గ్యాసోలిన్, బయోఫ్యూయల్ తయారీకి సంబంధించిన ప్రక్రియకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 2025/26 నుంచి 2030 వరకు 20శాతం ఇథనాల్ మిక్సింగ్ గ్యాసోలిన్‌ను వినియోగంలోకి తేవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)