ఇస్లాంలో హత్య అనేది ఘోరమైన నేరం !

Telugu Lo Computer
0


నాగరాజు హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పలువురు ఖండించారు. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును ఆమె సోదరుడు మరొకరితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హత్య అనేది ఇస్లాంలో ఘోరమైన నేరం అని చెప్పారు. ఇప్పటికే నిందితులు అరెస్ట్ అయ్యారని వివరించారు. కానీ కొందరు మాత్రం దీనికి వేరే రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని అసద్ సూచించారు. హత్య ఇస్లాం మతానికి వ్యతిరేకంగా జరిగిందని అసదుద్దీన్ అన్నారు. అమ్మాయి ఇష్టపూర్వకంగా అతనిని పెళ్లి చేసుకుందని, ఇందుకు చట్టం కూడా అనుమతి ఇస్తుందని తెలిపారు. నాగరాజును చంపే హక్కు సోదరుడికి లేదని చెప్పారు. ఇదీ నేరపూరిత చర్య అని ఇస్లాంలో ఘోరమైన నేరం అని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. నిందితులు సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్, మసూద్ అహ్మద్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)