గూండాను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 8 May 2022

గూండాను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది


హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ భవన్ గేటుకి ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన జెండాలు కట్టిన ఖలిస్థాన్ వేర్పాటు వాదులు మద్దుతుగా నినాదాలు కూడా చేశారు. ఈఘటన ఢిల్లీలో చిన్నపాటి ప్రకంపనలు సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా స్పందిస్తూ హిమాచల్ రాష్ట్రంలో, కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 'హిమాచల్ ప్రదేశ్ లో ఖలిస్థాన్ ఉగ్రవాదులు జెండాలు ఎగరేసి వెళితే తమ భారతీయ యువ మోర్చా జాతీయ కార్యదర్శిని రక్షించే పనిలో బీజేపీ ప్రభుత్వం మొత్తం నిమగ్నమై ఉందంటూ' సిసోడియా ట్వీట్ చేశారు. హిమాచల్ అసెంబ్లీ వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాద జెండాలు ప్రత్యక్షం అవడం పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమేనని సిసోడియా ఆరోపించారు. అసెంబ్లీని రక్షించలేని ప్రభుత్వం ఇక ప్రజలను ఏం రక్షిస్తుందని సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా ధర్మశాలలోని హిమాచల్ అసెంబ్లీ భవనం ప్రహరీ గోడలపై ఖలిస్థాన్ జెండాలు కట్టిన వారిపై కేసులు నమోదు చేశామని దుండగులను గుర్తించే పనిలో ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరోవైపు..భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తేజిందర్ బగ్గపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పెట్టిన కేసులపై పంజాబ్ హర్యానా హై కోర్టు మే 10 వరకు స్టే విధించింది. బగ్గ పై ఎటువంటి విచారణ జరపకూడదని పోలీసులను ఆదేశించింది కోర్టు. బీజేవైఎం జాతీయ కార్యదర్శి అయిన తేజిందర్ బగ్గ శత్రుత్వం పెంచడం, నేరపూరిత బెదిరింపులు వంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసారంటూ ఆమ్ ఆద్మీ నేత సన్నీ అహ్లువాలియా మొహాలీలో కేసు పెట్టారు.

No comments:

Post a Comment