రుతుపవనాలు మరింత విస్తరణ !

Telugu Lo Computer
0


బంగాళాఖం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్‌ కంటే ఆరు రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. అండమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలో నాలుగు, ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య, మధ్య వాయువ్య భారత్‌పై ఉష్ణగాలుల ప్రభావం క్రమంగా తగ్గుతాయని, మరో 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత కొనసాగుతున్నట్లు వివరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)