ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంటు !

Telugu Lo Computer
0


ఆంధ్రదేశ్ లోని ఏలూరు జిల్లా గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసాలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ఆక్వా జోన్‌లో ఉన్న 10 ఎకరాలు సాగు చేస్తున్న రైతులందరికీ రూ.1.5కే సబ్సిడీపై కరెంటు అందిస్తున్నామని ప్రకటించారు. రైతు భరోసా పథకం గత ప్రభుత్వంలో ఉందా? ఏడాదికి రూ.13,500లు ఇచ్చారా? కౌలు రైతులకు ఏనాడైనా పెట్టుబడి సహాయం చేశారా? ఇలా రూ.13,500 చొప్పున ఇచ్చారా? అని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పింది రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు ఇస్తామని,చెప్పింది 4 ఏళ్లు అయితే 5 ఏళ్లు ఇస్తున్నామన్నారు.  రూ.13,500 చొప్పున 67,500 రైతన్నలకు ఇస్తున్నామని, దీన్ని గమనించమని కోరుతున్నానన్నారు. వైయస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా 65 లక్షల మందికి పైగా రైతులకు రూ.1,282 కోట్ల రూపాయలు సున్నావడ్డీకింద ఇచ్చామని, ఐదేళ్లలో చంద్రబాబు రూ.782 కోట్లు ఇచ్చారని విమర్శలు చేశారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతుకు అండగా నిలిచాం.. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, అర్హత ఉన్న రైతుకు మేలు చేస్తున్నామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)