ఖుష్బూయేనా ?

Telugu Lo Computer
0


ఖుష్బూ లుక్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దాదాపు 15 కేజీల బరువు తగ్గి గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉంది.  తాజాగా ఖుష్బూ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా, ఇందులో ఖుష్బూ క్యూట్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. 50 ఏళ్ల ముద్దుగుమ్మ 25 ఏళ్ల అమ్మాయిలా మారిందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తన అందచందాలతో సౌత్‌ని ఓ ఊపు ఊపేసిన ఖుష్బూ విక్టరీ వెంకటేష్ తో కలియుగ పాండవులు చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు. ఈ బ్యూటీ 50 ఏళ్ళ వయసు వచ్చినా చెక్కుచెదరని చర్మ సౌంద్యరంతో మెరిసిపోతుంది. ఎప్పుడూ  సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తన బ్యూటీ సీక్రెట్ ను కూడా తెలియజేస్తూ ఉంటుంది. తమిళంలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ వారి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది.అందుకే ఆమెకు గుడులు కట్టి పూజలు చేశారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతూ అలరిస్తుంది. రీసెంట్‌గా ఖుష్బూ స్లిమ్ లుక్‌లోకి మారిన ఫొటోలు షేర్ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)