మహానాడుకు కేశినేని నాని డుమ్మా

Telugu Lo Computer
0


విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీలో సీనియర్ నాయకుడు. విజయవాడ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు.  తాజాగా ఒంగోలులో టాటీడీపీ మ మహానాడుకు డుమ్మా కొట్టడంతో టీడీపీ అధినేతతో, టీడీపీ విజయవాడ నేతలతో గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా కేశినేని ఆఫీస్ లో చంద్రబాబు ఫొటో తొలగించడంతో పార్టీ మారుతున్నారనే దుమారం రేగింది. అదికూడా సద్దుమణిగింది. అయితే మహానాడుకి రాకుండా ఢీల్లీలో మకాం వేయడంతో మరోసారి జోరుగా చర్చ సాగుతోంది. విజయవాడలో కూడా టీడీపీ నేతలు రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమా, దేవినేని ఉమా వంటి నేతలు దూరంగా ఉండటంతోపాటు కేశినేని డైరెక్ట్ ఆనే వ్యతిరేకిస్తున్నారు. ఇక గతేడాది విజయవాడలో జరిగిన మేయర్ ఎన్నికల్లో కేశినేని తన కూతురును బరిలోకి దింపగా సపోర్ట్ చేయలేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఇదే విషయంలో కూడా మరింత గ్యాప్ వచ్చింది. అయితే ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం విశేషం.గతంలో కూడా కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసినప్పుడు విజయవాడ నేతలందరూ రియాక్ట్ అయ్యారు. నిరసనలు తెలిపారు. అయితే ఆ టైంలో కూడా కేశినేని ఒక్కమాట మట్లాడలేదు. ఇంత జరిగినా కేశినేని ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. అనే విషయంలో కూడా తీవ్ర చర్చ జరిగింది.ఎంపీగా కేశీనేనిపై కూడా వ్యతిరేకత ఉందని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేశినేని తమ్ముడు కేశినేని చిన్ని లోకేశ్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. అందుకే మహానాడులో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంన్నాడని టాక్. అయితే వచ్చే ఎన్నికల్లో నానికి టికెట్ కేటాయించే అవకాశాలు ఉండకపోవచ్చనే చర్చ సాగుతోంది. అయితే నాని అలకవెనక మతలాబేంటి..? మరి విషయంలో బుజ్జగిపులు ఉంటాయా.. లేక తమ్మడు కేశినేని కి చినబాబు సపోర్ట్ చేస్తుండటంతో ఈ ఇష్యూని సైలెంట్ గా వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే..

Post a Comment

0Comments

Post a Comment (0)