పేషంట్ పట్ల డాక్టర్ వికృత చేష్టలు !

Telugu Lo Computer
0


జార్ఖండ్‌ రాష్ట్రం గొడ్డా జిల్లా మెహ్రామా బ్లాక్‌లోని బనౌద పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. మే 26న దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్త మీద కోపంతో భార్య విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే పూర్తిగా కోలుకునేందుకు ఆస్పత్రిలో కొన్ని రోజులు అడ్మిట్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో రెండో రోజు భార్యను చూడటానికి వచ్చిన భర్తకు. బెడ్ మీద ఆమె కనిపించలేదు. దీంతో కంగారుగా ఆస్పత్రి మొత్తం వెతికాడు. అయినా ఎక్కడా కనిపించలేదు. చివరగా డాక్టర్ గదిలో కర్టన్ తొలగించి చూడగా.. తన భార్య వద్ద వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించడం కనిపించింది. ఆమెకు మత్తు మందు ఇచ్చిన వైద్యుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన భర్త.. వైద్యుడిని నిలదీశాడు. జనం మొత్తం గుమికూడడంతో వైద్యుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడికి చేరుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి వైద్యుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)