తెలంగాణలో మద్యం కిక్కు

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్‌ వాల్యూపరంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం సీసాలు అమ్ముడుపోయాయి. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్‌ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్లు కొనేస్తున్నారు. బీర్లకు భారీగా గిరాకీ ఏర్పడిందని, మద్యం ప్రియులు ఎండాకాలం బీర్లపైనే ఆధారపడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎక్సైజ్ ఆదాయం మరింతగా పెరగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)