పంజాబ్ జైల్లో నిమ్మకాయల స్కాం

Telugu Lo Computer
0


పంజాబ్ లోనికపూర్తలా మోడ్రన్ జైలులో ఖైదీల ఆహారం కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జైళ్ల శాఖ ఏడీపీజీ వీరేంద్ర కుమార్ మే 1న ఇద్దరు సీనియర్ ఆఫీసర్లను ఆకస్మిక తనిఖీ నిమిత్తం జైలుకు పంపించారు. రికార్డులను పరిశీలించగా అక్కడి ఆఫీసర్ల బాగోతం బయటపడింది. ఖైదీలకు భోజనంలో అందించడానికి కిలో రూ.200 చొప్పున 50 కిలోల నిమ్మకాయలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి ఉండటాన్నిగమనించారు. ఇదే విషయాన్ని ఖైదీలను అడుగగా తమకు భోజనంలో నిమ్మకాయలు ఇవ్వలేదని చెప్పారు. వేసవి తాపంతో కిలో నిమ్మయాకల ధర గత నెలలో రూ.200 కు ఎగబాకింది. జైలులో వండిన ప్రతి చపాతీ 50 గ్రాముల కంటే తక్కువ బరువుతో ఉంటుందని, దీంతో పిండి సరఫరా కూడా పక్కదారి పట్టి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అనేక అవకతవకలు వెలుగు చూడటంతో పంజాబ్ జైళ్లు, మైనింగ్ మరియు పర్యాటక శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ జైలు సూపరింటెండెంట్‌ గుర్నామ్ లాల్‌ను సస్పెండ్ చేసి విచారణ కు ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)