ఆంధ్రప్రదేశ్‌కు మరో రూ.879 కోట్లు నిధులు విడుదల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ సహా 14 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెండో నెల వాయిదాగా రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.86,201 కోట్లుండగా అందులో 14 రాష్ట్రాలకు పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు (పీడీఆర్‌డీ) గ్రాంట్‌ రెండో నెలవారీ వాయిదాను శుక్రవారం కేంద్రం విడుదల చేసింది. 2022-23కి ఆంధ్రప్రదేశ్‌కు సిఫార్సు చేసిన పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.10,549 కోట్లు కాగా, రెండో నెల విడతగా రూ.879.08 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అందించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)