రూ.5.93 కోట్ల విద్యుత్ చోరీ !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని థానే జిల్లాలో రూ. 5.93 కోట్ల రూపాయల విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు ఓ తండ్రీ కొడుకులు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్  అధికారుల బృందం మే 5న ఫలేగావ్‌లోని స్టోన్ క్రషింగ్ యూనిట్‌పై దాడి చేయడంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. "మీటర్ రీడింగ్‌లను ట్యాంపరింగ్ చేసే గాడ్జెట్‌ను ఉపయోగిస్తూ, రిమోట్‌గా విద్యుత్‌ను దొంగిలిస్తున్నారు వీళ్లు. గత 29 నెలల్లో మొత్తం 34,09,901 యూనిట్లు విద్యుత్ చౌర్యం చేయగా, దాని విలువ రూ. 5.93 కోట్లుగా అంచనా వేశారు. దీనికి సంబంధించి, దొంగలు చంద్రకాంత్ భాంబ్రే, అతని కుమారుడు సచిన్‌లపై విద్యుత్ చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం ముర్బాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గత నెలలో, మహారాష్ట్రలో విద్యుత్ చౌర్యంలో ఉపయోగించే 46,000 మెటల్ హుక్స్‌ని తొలగించింది. దీనితో, దాదాపు 500 మెగావాట్ల విద్యుత్‌ను అధికారులు ఆదా చేశారు. ఒక సందర్భంలో, మెటల్ హుక్ సహాయంతో విద్యుత్తును దొంగిలించడానికి 1,000 అడుగుల పొడవైన కేబుల్‌ను ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)