దేశంలో 3805 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 3805 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 వేల 303కు చేరింది. అంతకుముందు దేశంలో 3 వేల 545 కేసులు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల శాతం 0.05 శాతం, రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. అటు గడిచిన 24 గంటల్లో 3168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 25 లక్షల 54 వేల 416 కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.78 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.79 శాతంగా ఉంది. ఇప్పటివరకు 84 కోట్ల 3 లక్షల మంది కరోనా పరీక్షలు చేశారు.గడిచిన 24 గంటల్లో 4 లక్షల 87 వేల 544 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఇందులో కొత్తగా 3805 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు 190 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)