లక్ష రూపాయల కంపెనీకి 3700 కోట్ల ప్రభుత్వ సంస్థను ఎట్ల అమ్మినవ్?

Telugu Lo Computer
0


ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ వస్తున్న కేంద్ర సర్కారుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే సీ పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, ట్రైన్లు, పలు ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు కట్టబెట్టడంపై ఆయన అనేక సందర్భాల్లో మోడీ సర్కారును తూర్పారబట్టారు. తాజాగా ఇప్పడు బాగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ 'పవన్ హన్స్‌'ను అమ్మేడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాఫిట్‌లో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీని అమ్మడమే ఓ ఘోరమైతే, దానిని కేవలం ఆరు నెలల క్రితం లక్ష రూపాయల పెట్టుబడితో పెట్టిన కంపెనీకి కట్టబెట్టడం చూస్తే అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు. 2017 సంవత్సరంలోనే పవన్ హన్స్ కంపెనీ విలువ రూ.3700 కోట్లు ఉండేదని, అలాంటి కంపెనీని నిన్న మొన్న పుట్టుకొచ్చిన లక్ష రూపాయల కంపెనీకి అమ్మడమేంటని నిలదీశారు. ఐదేళ్ల క్రితమే 3700 కోట్ల విలువైన కంపెనీలో 49 శాతం వాటాను రూ.211 కోట్లకు అమ్మడం ఎలా సాధ్యమంటూ కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా ఓ దివాళాకోరు ప్రభుత్వమా అంటూ మోడీ సర్కారును దుయ్యబట్టారు. ఆయన చేసిన ట్వీట్‌లో పవన్ హన్స్ సంస్థ అమ్మకానికి సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన వార్త కథనాల క్లిప్పింగ్స్‌ను జోడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)