ఎవరీ సుమ్మిమా ఉదాస్..? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 3 May 2022

ఎవరీ సుమ్మిమా ఉదాస్..?


నేపాల్ లో రాహుల్‌తో నైట్‌క్లబ్‌లో ఉన్న వ్యక్తి సుమ్మిమా ఉదాస్. ఆమె నేపాలీ మహిళ. సుమ్మిమా ఉదాస్ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఇంటర్నేషనల్‌కు ఢిల్లీ ప్రతినిధిగా పనిచేసింది. ఈ క్రమంలో దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. అంతేకాదు.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్ అవినీతి కుంభకోణం తదితర అంశాలపై ప్రముఖంగా ఆమె కథనాలు రాశారు. అంతేకాక 2014 భారత్ సాధారణ ఎన్నికలను కూడా కవర్ చేశారు. ఆమె తండ్రి భీమ్ ఉదాస్ దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్ లో నేపాల్ రాయబారిగా సేవలందించారు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి దాదాపు 10 దేశాల్లో ఉన్నారు. వర్జినియాలోని వాషింగ్టన్ అండ్ లీ యూనివర్శిటీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో బ్యాచిలర్ చేసిన ఉదాస్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సుమ్మిమా ఉదాస్ రాహుల్ కు స్నేహితురాలు. సుమ్మిమా ఉదాస్ వివాహం ఈనెల 5న జరగనుంది. ఈ వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్ గాంధీ ఖాట్మండ్ వెళ్లారు. 

No comments:

Post a Comment