20 బంతుల్లో 102 పరుగులు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 14 May 2022

20 బంతుల్లో 102 పరుగులు
ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్, హైదరాబాద్ మాజీ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అద్భుతమైన అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. జానీ బెయిర్‌స్టో(66) తుఫాన్ ఇన్నింగ్స్‌కు పంజాబ్ కింగ్స్ కేవలం 5 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(21) కూడా క్యామియో ఆడటంతో పంజాబ్ జట్టుకు అద్భుతమైన శుభారంభం దక్కింది. యధావిధిగా మిడిల్ ఆర్డర్‌లో లియామ్ లివింగ్‌స్టన్(70) తనదైన శైలి సిక్సర్ల వర్షం కురిపించగా.. నిర్ణీత ఓవర్లకు పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో జానీ బెయిర్‌స్టో ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయాడు. నెక్స్ట్ మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా.? లేదా.? అనే పరిస్థితి వచ్చేసరికి.. తన స్టైల్‌లో విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసేసరికి బెయిర్‌స్టో 3 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌లో బెయిర్‌స్టోకు ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. అతని హాఫ్ సెంచరీ కారణంగా పంజాబ్ జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి 83 పరుగులు చేసింది. ఎప్పటిలానే లివింగ్‌స్టన్ బౌలర్లపై మరోసారి విరుచుకుపడ్డాడు. మిడిల్ ఆర్డర్‌లో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా.. అవసరమైనప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్‌ వరకు క్రీజులో ఉన్న లివింగ్‌స్టన్ 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో లివింగ్‌స్టన్‌కు ఇది 4వ అర్ధ సెంచరీ కావడం గమనార్హం. వీరిద్దరూ కలిసి బౌండరీల రూపంలో 20 బంతుల్లో 102 పరుగులు చేశారు.. ఇద్దరి ఇన్నింగ్స్‌లను కలిపితే మొత్తంగా 9 ఫోర్లు, 11 సిక్సర్లు వచ్చాయి. షాబాజ్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఔట్. బెయిర్‌స్టో 29 బంతుల్లో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 227.59గా ఉంది. షాబాజ్ అహ్మద్‌ వేసిన10వ ఓవర్ తొలి బంతికి షార్ట్ థర్డ్ మ్యాన్ మీద భారీ షాట్‌కు ప్రయత్నించిన బెయిర్‌స్టో.. మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

No comments:

Post a Comment