దేశంలో కొత్తగా 1,862 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 1,862 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ సంఖ్య 2,364కు పెరిగింది. బుధవారం 4.77లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ తో చికిత్స పొందుతూ 2,582 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 4.31కోట్ల మంది కొవిడ్ బారిన పడగా, చికిత్స పొందుతూ 4.25 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 0.04శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ రెండేళ్ల కాలంలో 1,91,79,96,905 డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం ఒక్కరోజు 13,71,603 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో 532 ఉండగా, కేరళలో 596, మహారాష్ట్రలో 307, హర్యానాలో 257, ఉత్తరప్రదేశ్ లో 139 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 77.45శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)