ఒకే నెలలో రెండోసార్లు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Telugu Lo Computer
0


గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పై మరోసారి రూ.3.50 పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.8 పెంచారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. భారత్ లో గ్యాస్ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1000 దాటాయి. మే నెలలో రెండో సారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. 14.2 కిలోల గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.3.5 పెంచారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది. ఇటీవలే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజాగా మరోసారి కమర్షియల్ గ్యాస్ ధర పెంచారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై భారాలు పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.200, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.750 పైగా పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)