బొగ్గు ఉత్పత్తి 1 బిలియన్‌ టన్నులకు పెంచాలని యోచన !

Telugu Lo Computer
0


విద్యుత్ సంక్షోభానికి కారణమైన బొగ్గు కొరతను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. మూతపడిన గనులను పున: ప్రారంభించడం ద్వారా రెండు మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తిని 75- 100 మిలియన్‌ టన్నుల దిశగా పెంచేందుకు యత్నిస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బొగ్గుశాఖ కార్యదర్శి ఎ.కె.జైన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే రెండవ బొగ్గు ఉత్పత్తి దారు, దిగుమతిదారు, వినియోగించే దేశమైన భారత్‌ ఈ ఏడాది మార్చి నాటికి 777.2 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని అన్నారు. సుమారు బిలియన్ టన్నులకు పైగా వినియోగించింది. దేశంలోని బొగ్గులో 80 శాతం ఉత్పత్తి చేసే సంస్థ అయిన కోల్‌ ఇండియా ప్రస్తుతం ఏడాదికి 622.6 మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేస్తోంది. 2024 నాటికి బొగ్గు వార్షిక ఉత్పత్తిని 1 బిలియన్‌ టన్నులకు పెంచాలని యోచిస్తోందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)