మహిళా ఎస్సైపై హత్యాయత్నం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 24 April 2022

మహిళా ఎస్సైపై హత్యాయత్నం !


తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి పోలీసు స్టేషన్ లో మర్గరెట్ థెరిసా ఎస్సైగా పని చేస్తున్నారు.  గతనెల 27న పాలవూరు కు చెందిన ఆర్ముగం అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించి వాహనం నడుపుతూ వెళుతున్నాడు. ఎస్సై మార్గరెట్ తన పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ సమయంలో మద్యం సేవించిన ఆర్ముగం వాహనం నడుపుతూ అదే రోడ్డులో వచ్చాడు. ఎస్సై మార్గరెట్ ఆర్ముగాన్నిపరీక్షించగా మద్యం సేవించి వాహానం నడుపుతూ పట్టుబడ్డాడు. మార్గరెట్ అతనికి పైన్ విధించింది. దీంతో ఆగ్రహించిన ఆర్ముగం మహిళా ఎస్సైపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా ఎస్సై ఆర్ముగానికి దేహశుధ్ధి చేసింది. ఈ ఘటనతో ఆర్ముగం మార్గరెట్ పై కక్ష పెంచుకున్నాడు. తనకు ఫైన్ వేయటమే కాక దేహశుధ్ధి చేయంతో కోపంతో రగిలి పోసాగాడు. ఆమెను ఎట్టాగైనా అంతమొందించాలనేంత కోపం పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఈనెల 22 రాత్రి పాలవూరు గ్రామంలో అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల బందోబస్తు కోసం మార్గరెట్ గ్రామానికి వచ్చింది. ఆమెను గమనించిన ఆర్ముగం కత్తితో ఆమెపై దాడి చేసి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో ఆమెకు మెడ, చెంప, ఛాతి భాగంపై గాయాలయ్యాయి. పారిపోతున్న ఆర్ముగాన్ని స్ధానికుల సాయంతో పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన ఎస్సై మార్గరెట్ ను తిరనల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ శనివారం ఆమెతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్ధితి అడిగితెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 5లక్షల రూపాయల సహాయం అందించారు. ఆర్ముగంపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

No comments:

Post a Comment