జమ్ము కాశ్మీర్‌ అభివృద్దిలో నూతన అధ్యాయం

Telugu Lo Computer
0


పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా మోదీ ఆదివారం జమ్ము-కాశ్మీర్‌లో పర్యటించారు. అక్కడి సాంబా జిల్లా, పల్లి అనే గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. 3,100 కోట్లతో నిర్మించిన బనిహల్-క్వాజిగండ్ రోడ్ టన్నెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ''జమ్మూలో అభివృద్దికి సంబంధించి కొత్త అధ్యాయం మొదలైంది. ప్రైవేటు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఇక్కడి యువతకు ఉపాది దొరుకుతుంది. ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఇక్కడ టూరిజంతోపాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి'' అన్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఘననీయంగా పెరిగిపోతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రోజూ 20,000 కోట్లకుపైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌పై మోదీ మాట్లాడారు. ''డిజిటల్ లావాదేవీల్లో దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మార్చి నెలలో మొత్తం దేశంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ విలువ పది లక్షల కోట్లకు చేరింది. రోజుకు 20,000 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి'' అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)