సుప్రియా సూలేతో శశిథరూర్‌ ముచ్చట్లు !

Telugu Lo Computer
0


లోక్‌సభలో శశిథరూర్‌ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో ముచ్చట పెట్టడపై సోషల్‌ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంపై సభలో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో ముచ్చటిస్తూ కనిపించారు. ముందు వరుస సీటులో ఆమె కూర్చొని ఉండగా, శశిథరూర్‌ వెనుక సీట్‌లో బల్లపై తల ఆనించి పడుకుని నవ్వుతూ కాసేపు మాట్లాడారు. ఓ వైపు ఫరూక్‌ అబ్దుల్లా సీరియస్‌గా సభలో ప్రసంగిస్తుండగా శశిథరూర్‌ ఫన్నీగా ఆమెతో ముచ్చట పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఫర్రగో అబ్దుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట బీజీఎంతో శశిథరూర్‌ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్‌ చేశారు. మరో నెటిజన్‌ శశిథరూర్ అంటే ఫైర్ కాదు.. ఫ్లవర్ అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)