చండీగఢ్‌ను పంజాబ్‌కి ఇవ్వండి

Telugu Lo Computer
0


ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చండీగఢ్‌ను తక్షణమే పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం శాసన సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాంతి, సామరస్యాలను పరిరక్షించేందుకు ఈ నగరాన్ని వెంటనే పంజాబ్‌కు అప్పగించాలని ఈ తీర్మానం కోరింది. గతంలో ఏదైనా రాష్ట్ర విభజన జరిగితే, రాజధాని నగరం మాతృ రాష్ట్రంతోనే ఉండేదని గుర్తు చేసింది. శాంతి, సామరస్యాలను కాపాడేందుకు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని చండీగఢ్‌ను పంజాబ్‌కు తక్షణమేు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభ మరోసారి సిఫారసు చేస్తోందని ఈ తీర్మానం పేర్కొంది. చండీగఢ్ నగరాన్ని పంజాబ్ రాజధానిగా నిర్మించారని తెలిపింది. గతంలో ఏదైనా రాష్ట్ర విభజన జరిగినపుడు రాజధాని నగరం మాతృ రాష్ట్రం వద్దనే ఉండేదని తెలిపింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ నగరాన్ని పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతున్నట్లు తెలిపింది. భారత రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య సిద్దాంతాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చండీగఢ్ పరిపాలనలో సమతుల్యతకు విఘాతం కలిగే చర్యలు తీసుకోవద్దని కోరింది. ఈ తీర్మానం కోసమే పంజాబ్ శాసన సభ ఒక రోజు సమావేశం జరిగింది. 1966లో హిందీ మాట్లాడే ప్రాంతాలతో హర్యానా రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు ఈ ప్రాంతాలు పంజాబ్‌ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత చండీగఢ్ నగరం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)