'ఆర్​ఆర్​ఆర్'​ కి వరల్డ్​లో టాప్​-3 ఘనత!

Telugu Lo Computer
0


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక సినిమా 'ఆర్​ఆర్​ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. వసూళ్ల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సరికొత్త రికార్డు ను 'ఆర్​ఆర్​ఆర్'​ క్రియేట్​ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్​ సాధించి.. టాప్‌ గ్రాసర్‌ లిస్ట్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా 'ఆర్​ఆర్​ఆర్'​ కన్నా ముందు ఆమిర్​ ఖాన్​ 'దంగల్'​, ప్రభాస్​ 'బాహుబలి 2' మాత్రమే ఉన్నాయి. 2016లో విడుదలైన 'దంగల్​' రూ.2,024 కోట్లను వసూలు చేయగా.. 2017లో రిలీజ్​ అయిన బాహుబలి కంక్లూజన్​ రూ.1,810 కోట్లు అందుకుంది. ఓవర్సీస్​ బాక్సాఫీస్​పై దండయాత్ర చేస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' మరో బెంచ్​మార్క్​ను సెట్​ చేసే దిశగా దూసుకెళ్తోంది. యూఎస్​ఏ మార్కెట్​లో 13.3 మిలియన్​ డాలర్లు కలెక్ట్​ చేసింది. భారత కరెన్సీ ప్రకారం రూ.100కోట్లుకు పైగానే. అంతకముందు 'బాహుబలి 2' అక్కడ ఇదే స్థాయిలో వసూళ్లను అందుకుంది. 113.79కోట్లు సాధించినట్లు ట్రేడ్​ వర్గాల సమాచారం. ఈ లెక్కల ప్రకారం 'ఆర్​ఆర్​ఆర్' హవా ఇంకా కొనసాగితే 'దంగల్​' కలెక్షన్లను దాటలేకపోయినప్పటికీ..​ 'బాహుబలి'ని మించే అవకశాముందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)