త్వరలో తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా మామిడికుదురులో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలట్ ప్రాజెక్టుగా 100 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం దశల వారీగా విశాఖపట్నం, విజయవాడతో పాటూ ప్రధాన నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 78 శాతానికి పెరిగేలా అధికారులు, సిబ్బంది శ్రమించాలని ఆయన సూచించారు. డీజిల్‌ ధరల పెరుగుదల సంస్థకు మోయలేని భారంగా మారిందని.. ఈ పరిస్థితుల్లోనే సెస్‌ విధించామని, ప్రజలు అర్థం చేసుకున్నా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)