బోస్నియాలో భూకంపం

Telugu Lo Computer
0


దక్షిణ బోస్నియాలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. బాల్కన్‌లోను భూమి కంపించిందని అధికారులు చెప్పారు. లుబింజే పట్టణానికి ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్‌గ్రేడ్, జాగ్రెబ్, స్కోప్జే వరకు ప్రకంపనలు సంభవించాయని బోస్నియా అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నాయని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ హెచ్చరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)