స్థానికత నినాదం అయితే దేశం విజేత అయి తీరుతుంది !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల ఎతైన హనుమంతుడి విగ్రహాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని ప్రజల నుద్ధేశించి ప్రసగించారు. స్తబ్ధత నెలకొంటే దేశానికి అది చేటు కల్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఇప్పుడు అందరిని ప్రమాదకర కూడళ్లకు నెట్టుతున్నాయి. ఈ దశలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సి ఉంటుంది. నిరాశ నిస్పృహలను స్తబ్థతలను దరిచేరకుండా చూసుకోవల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే పాతిక సంవత్సరాల గడువు పెట్టుకుని మనమంతా అనివార్యంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరిగితే, విదేశీ సరుకుల జోలికి వెళ్లకుండా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య మటుమాయం అవుతుందన్నారు. దేశం ఎప్పుడూ ఏ దశలోనూ ఎక్కడేసిన గొంగడి అక్కడే స్థితిని కొనితెచ్చుకోరాదు, నిద్రలో అయినా మేల్కొని ఉన్నా చైతన్యస్ఫూర్తితో ముందుకు సాగాలి. స్తబ్ధతను ఒంటబట్టించుకోవద్దు అని సూచించారు. ప్రపంచానికి పెను సవాలుగా కరోనా తలెత్తింది. ఈ సవాలు పలు అనుభవాలను మిగిల్చింది. అయితే ప్రపంచ దేశాలన్ని ఇప్పుడు స్వయం సమృద్ధి లేదా ఆత్మనిర్భరతను అలవర్చుకునే విధంగా చర్యలకు దిగుతున్నాయని తెలిపారు. దేశీయ ఉత్పత్తులను మనసు నిండా అభిమానంతో కొనుక్కునే విధంగా మన సాధువులు సంతు జనులు ఉద్భోధించాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. స్థానికత నినాదం అయితే దేశం విజేత అయి తీరుతుందని తెలిపారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడం జరిగితే సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది.  చేతి నిండా పని దొరుకుతుంది. నిరుద్యోగ సమస్యకు కళ్లెం పడుతుందని వివరించారు. స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం వెనుక కీలకమైన ఆర్థిక శాస్త్ర ప్రక్రియ అంతర్లీనంగా దాగి ఉందని చెప్పారు. ఎక్కువ మందికి ఉపాధి దొరికే దేశం ఎంతటి సుభిక్షంగా ఉంటుందనేది మనం పాటించే ఈ దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహపు అలవాటుతోనే స్పష్టం అవుతుందన్నారు. మోర్బీలోని కేశవానంద జీ ఆశ్రమంలో భారీ స్థాయి హనుమాన్ విగ్రహం ఏర్పాటు అయింది. ఈ దశలో ప్రధాని మోడీ హనుమంతుడు గిరిజన మిత్రుడని కొనియాడారు. అటవీ ఉత్పత్తులు ఆస్వాదించారు. గిరిజనులను ఆదరించారని గుర్తు చేశారు. హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని స్థానికతకు పట్టం కట్టేందుకు కంకణధారణ చేసుకోవల్సి ఉందని ఉద్భోధించారు. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ పూదండలో ఇదో ప్రధాన వరుస అవుతుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)