యూట్యూబ్ చూసి అబార్షన్‌కు యత్నించిన బాలిక !

Telugu Lo Computer
0



మహారాష్ట్ర, నాగ్ పూర్‌లోని నార్ఖేడ్ కు చెందిన బాలిక (17) అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. గతేడాది ఆ యువకుడికి నాగపూర్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు నాగపూర్ లోని ఐఎండీసీ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఆమె నార్ఖేడ్ నుంచి నాగపూర్ తన బోయ్‌ప్రెండ్ రూమ్‌కు వెళ్ళింది. అక్కడ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. కొన్నాళ్లకు ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. అతడు అబార్షన్ అవటానికి కొన్ని మందులు సూచించాడు. అవి వేసుకున్నా ఆమెకు ఆబార్షన్ కాలేదు. దీంతో అబార్షన్ ఎలా చేసుకోవాలో అని యూ ట్యూబ్ చూసింది. అందులో చెప్పినట్లు నాలుగు రోజుల క్రితం ఇంట్లో అబార్షన్ కోసం ప్రయత్నించింది. ఆ సమయంలో అబార్షన్ అయి, పసిపాప నేలమీద పడటంతో ఇంట్లో కుటుంబ సభ్యులు చూశారు. వెంటనే వారు పసిపాపతో బాలికను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పసికందు మరణించిందని వైద్యులు తెలిపారు. బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రియుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)