ప్రశ్నాపత్రం లీకేజీలో తొమ్మిది మంది టీచర్ల అరెస్ట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ అంశం వివాదాస్పదమవుతోంది. కావాలనే, పథకం ప్రకారం క్వశ్చన్‌పేపర్ లీక్ చేశారని దర్యాప్తులో తేలింది. దీంతో తొమ్మిది మంది టీచర్లను బాధ్యులుగా చేస్తూ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం, అంకిరెడ్డి పల్లె జడ్పీ హైస్కూల్ లో పది ప్రశ్నాపత్రం లీకేజీ వెనక కొన్ని ఎనిమిది మంది జడ్పిహెచ్ఎస్ స్కూళ్ల తెలుగు టీచర్ల తో పాటు ప్రైవేట్ స్కూళ్ల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. ఈ విషయంలో ఇప్పటికే తొమ్మిది మంది ఉపాధ్యాయుల హస్తం ఉన్నట్లు తేలడంతో వారిపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డి.ఎస్.పి రాజేంద్ర రెడ్డి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)