ఫ్లెక్సీలకు జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు సిటీ వ్యాప్తంగా చాలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనికి కొనసాగింపుగానే బుధవారం కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లు కనిపించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా మరోసారి ఫిర్యాదులు చేయడంతో అధికార యంత్రాంగం అధికార పార్టీ నేతలపై కొరడా ఝుళిపించింది. సిటీలో భారీ మొత్తంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలకు జరిమానా విధించింది. ప్లీనరీ సందర్భంగా ఎక్కువ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భారీగా ఫైన్ కట్టాల్సిన వారిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముందు వరుసలో నిలిచారు. మంత్రిగారికి జీహెచ్‌ఎంసీ అక్షరాల 50వేల రూపాయల ఫైన్ విధించింది. మంత్రితో పాటు మరో ముగ్గురికి జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు 40వేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి 5వేలు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కి 10వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)