రాజ్‌థాకరేపై కేసు

Telugu Lo Computer
0


మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన  చీఫ్ రాజ్ థాకరేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. థానే సిటీలో జరిగిన ఒక బహిరంగ సభలో కత్తి ఝళిపించారనే అభియోగంపై ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 25 కింద ఆయనతో పాటు, ఎంఎన్‌ఎస్ థానే, పాల్ఘర్ జిల్లా చీఫ్ అవినాష్ జాదవ్, థానే సిటీ చీఫ్ రవీంద్ర మోరేపై కేసులు నమోదు చేశామన్నారు. గడ్కరి చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక నేత ఒకరు కత్తి బహుకరించగా, దానిని రాజ్‌థాకరే ఝళిపించారు. మసీదులో లౌడ్ స్పీకర్లు తొలగించాలన్న ఎంఎన్ఎస్ డిమాండ్ ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. మే 3వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే తమ పార్టీ కార్యకర్తలు మసీదుల ముందు హనుమాన్ చాలీసా పాడతారంటూ రాజ్‌థాకరే అల్టిమేటం ఇచ్చారు. అయితే, ఆయన డిమాండ్‌ పట్ల శివసేన సారథ్యంలోని మహా వికాస్ అఘాడి సర్కార్ సుముఖంగా లేదంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)