ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులా?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదైన మహారాష్ట్రలో రెండు రాజధానులు ఉన్నప్పటికీ, విదర్భలో రాజధాని ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందలేదని గుర్తు చేశారు. మూడు రాజధానులు అంటున్న సీఎం జగన్ హైదరాబాద్ నుంచి పాలిస్తున్నారా? అని రైతులను ప్రశ్నించారు. దీనికి రైతులు బదులిస్తూ అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన శాసనసభ, సచివాలయం నుంచే ఆయన పనిచేస్తున్నారని బదులిచ్చారు. అమరావతి నిర్మాణంపై అప్పట్లో చంద్రబాబు తనకు వివరించారని, ఆ ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉందని గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రం అద్భుతమైన రాజధానిని నిర్మించుకుంటోందని చాలా సంతోషించామని చెప్పారు. ఉన్న రాజధాని నుంచే పనిచేయలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమరావతే ఏపీ రాజధాని అన్న కోర్టు తీర్పును కూడా జగన్ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా రైతులు శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేతలు అమరావతికే మద్దతు తెలుపుతున్నా కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని రైతు ప్రతినిధులు వాపోయారు. దీంతో అమరావతికి తమ పార్టీ తరపున పార్లమెంటులో మద్దతు ఇస్తామని పవార్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)