ఇనుప బ్రిడ్జిని దొంగలు ఎత్తుకెళ్లారు !

Telugu Lo Computer
0


బీహార్‌లోని  రోతాస్ జిల్లాలో తాము నీటిపారుదల శాఖ అధికారులమని 60 అడుగుల పాడుబడ్డ వంతెనను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పోలీసు ఫిర్యాదు అనంతరం కానీ ఇది దొంగతనం అని తెలియకపోవడం గమనార్హం. ఈ విషయమై ఏప్రిల్ 7న నర్సిగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వాస్తవానికి 1972లో అర్ర కెనాల్‌పై నిర్మించి ఈ వంతెనను ప్రస్తుతం ఉపయోగించడం లేదు. పూర్తి ఇనుముతో నిర్మించిన ఈ వంతెన పూర్తి పాడవడంతో ప్రమాదకరమైన వంతెనగా ప్రకటించి వదిలేశారు. తొందరలోనే ఈ వంతెనను కూల్చేయాలని కూడా అనుకున్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇంతలో ఇరిగేషన్ అధికారులమని వచ్చిన కొంత మంది దొంగలు జేసీబీ, లారీలు, గ్యాస్ కట్టర్లు తీసుకువచ్చి మూడు రోజుల పాటు శ్రమించి వంతెనను దొంగిలించారు. సమీప ఊర్లో ఉన్న వారు, సమీప అధికారులెవరికీ ఇది దొంగతనం అని అనుమానం రాలేదు. ఈ దొంగతనానికి ముందు కూడా ఈ వంతెనలోని అనేక భాగాలు దొంగతనానికి గురవుతూ వస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)