భారీగా తగ్గిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర

Telugu Lo Computer
0


కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ అందుబాటులోకి రానుండటానికి ఒక రోజు ముందుగానే భారీగా ధర తగ్గిపోయింది. సగం కంటే తక్కువగా అంటే రూ.600 నుంచి రూ.225కి పడిపోయింది. “కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్ ను ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ.600కు బదులుగా రూ.225కే అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. కేంద్రం నిర్దేశించినట్లుగా 18 సంవత్సరాల పై బడిన వారంతా ప్రికాషనరీ డోసుగా కొవీషీల్డ్ ను తీసుకుంటారని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. గతంలో ఉన్న రూ.600 + ట్యాక్స్ ను సవరిస్తూ.. రూ.225 + ట్యాక్స్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయి. కోవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలు భారీగా తగ్గడంతో ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా కనిపిస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)