ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ మృతి

Telugu Lo Computer
0


తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (78) మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నారాయణ దాస్ కె నారంగ్… స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏషియన్ మల్టీ ప్లెక్స్ మరియు ఏషియన్ థియేటర్స్ అధినేత గా వున్న నారంగ్ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో లవ్ స్టొరీ, లక్ష్య సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున సినిమా ఘోస్ట్, ధనుష్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నారు నారాయణ దాస్ కె నారంగ్. నిర్మాత గా డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా సిని పరిశ్రమకు సేవ లందించారు నారాయణ దాస్ కె నారంగ్. ఇక నారంగ్ మృతి పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)