ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ పరిశ్రమ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటవనుందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. ఏప్రిల్ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా "గ్రాసిమ్ ఇండస్ట్రీ" ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఏర్పాటైన గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా 2,700 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు. 75శాతం స్థానికులకు ఉద్యోగులివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కూడా గ్రాసిమ్ అంగీకరించినట్లు తెలిపారు. ఏపీ యువతకు గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1150 మందికి కలిపి మొత్తంగా 2,450 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని మంత్రి తెలిపారు. భూగర్భ జలాల కాలుష్కానికి ఆస్కారమే లేని విధంగా అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని గ్రాసిమ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి అమర్ నాథ్ తెలిపారు. ఈ పరిశ్రమపై 24x7 పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇది కంబైన్డ్ వాటర్ ట్రీట్ మెంట్, ఎఫ్లూయెంట్‌ను చేర్చడానికి పూర్తిగా సవరించిన డిజైన్‌తో పాటు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సౌకర్యం గ్రాసిమ్ లో ప్రత్యేకంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. ట్రీట్‌మెంట్ , రీసైకిల్ ప్లాంట్ ద్వారా సైట్ నుండి ద్రవం సైట్ దాటి బయటకు వెళ్లకుండా..తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ వహించినట్లు మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)