వైసీపీ విద్యుత్‌ ప్రభ వద్ద గందరగోళం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ఓని మార్కాపురం మండలంలోని గుండంచెర్లలో శుక్రవారం జరిగిన వేనూతల కాటంరాజు తిరునాళ్లలో రికార్డింగ్‌ డ్యాన్స్‌ రివర్స్‌ అయ్యింది. బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన విద్యుత్‌ ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. అవి రాత్రి 11గంటలకు ప్రారంభమయ్యాయి. కళాకారులు పాటలతో పాటు అసభ్య నృత్యాలతో చిందులు వేశారు. ప్రేక్షకులు ఆ నృత్యాలను వీడియోలు తీస్తుండటంతో పోలీసుల అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆర్కెస్ట్రా నిర్వాహకుడు ప్రేక్షకులను హెచ్చరిస్తూ ఇలాగైతే కేవలం సంగీత విభావరి మాత్రమే ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రేక్షకులు బారికేడ్లను దాటి అక్కడ విధి నిర్వహణలో ఉన్న సీఐ, ముగ్గురు ఎస్‌ఐలతో వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీస్‌ అధికారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కిశోర్‌కుమార్‌ ప్రత్యేక బలగాలను అక్కడకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన విద్యుత్‌ ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)