ఢిల్లీలో నా సీటు లాగేసుకున్నారు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 April 2022

ఢిల్లీలో నా సీటు లాగేసుకున్నారు!


''అసెంబ్లీలో కూర్చునే కిషన్ రెడ్డి ఢిల్లీలో నా సీటు నుంచి నన్ను తప్పించి ఆయన కూర్చున్నారు.'' అంటూ చిరంజీవి చమత్కరించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవం జరిగింది. ఉగాది సందర్భంగా, రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ రావు మెగావల్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. తన చమత్కారాలతో వేదికపై నవ్వులు పూయించారు. సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. త్రిబుల్ 'సి' ఫార్ములాతో కల్చర్, క్రాఫ్ట్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు చిరంజీవి. భారతీయత తత్వం పటిష్టం చేయడానికి ఉత్సవాలు ఎంతో కృషి చేస్తాయని అన్నారు. ప్రాంతీయ సినిమాల మధ్య తెలుగు సినిమా హద్దులు చేరిపేసిందని చిరంజీవి పేర్కొన్నారు. బాహుబలి నుంచి త్రిబుల్ ఆర్ వరకు అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని స్వయంగా మోడీ చెప్పారని చిరంజీవి ఉటంకించారు. ఎన్టీఆర్ స్టేడియంలో రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఉగాది సందర్భంగా, రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కల్చరల్ ఫెస్టివల్‌లో వృత్తులను నమ్ముకుని ఉన్నవాళ్లనే పిలిచామని, ప్రొఫెషనల్స్‌ని పిలువ లేదని చెప్పారు. కళాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని చెప్పారు. ఇది ప్రభుత్వ పండగ కాదని, ప్రజల పండుగ అని చెప్పారు. 75 దేశాల్లో పర్యటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు15వ తేదీన ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment