ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు !

Telugu Lo Computer
0


కర్ణాటక, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను ప్రారంభించింది. ఆ రాష్ట్రాలకు చెందిన అధికారులకు ఏకకాలంలో ఈ మాస్టర్‌ శిక్షణ శిబిరాలను మే 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 54 మంది సీనియర్‌ అధికారులను ఐదు బృందాలుగా శిక్షణ కోసం ఆహ్వానించారు. ఐదు బృందాల్లో పాల్గొనాల్సిన అధికారుల పేర్లతో కూడిన జాబితా కూడా బుధవారం విడుదలైంది. ఈ తాజా పరిణామంతో శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కనీసం ఆరునెలల ముందుగా శాసనసభకు ఎన్నికలు నిర్వహించే సందర్భాల్లోనే ఇలా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఆనవాయితీ ఉందని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారి ద్వారా తెలిసింది. అయితే ఇవి సాధారణ సమావేశాలని, ఎన్నికలు జరగడానికి ఏడాది సమయం ఉన్న రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి శిక్షణ సమావేశాలను గతంలోనూ ఇలాగే నిర్వహించిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)