ప్రధాని మూడు రోజుల విదేశీ పర్యటన ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 April 2022

ప్రధాని మూడు రోజుల విదేశీ పర్యటన !


ప్రధాని నరేంద్ర మోదీ మే 2 నుంచి మూడు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సంవత్సరంలో ప్రధాని తొలి విదేశీ పర్యటన ఇదే. మొదట ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రధాని డెన్మార్క్ వెళ్లతారు. తిరుగుప్రయాణంలో మే 4న ప్యారిస్‌కు చేరుకోనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో  వెల్లడించింది. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. భారత్‌-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో విడత సమావేశాలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. వాణిజ్యవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్ హగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న రెండవ ఇండియా నార్దిక్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్ ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధాన మంత్రుల తో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి.

No comments:

Post a Comment