మసీదుల్లో మైకులకు అనుమతి తీసుకోండి !

Telugu Lo Computer
0


ప్రార్థనా స్థలాల్లో మైకుల ఏర్పాటుపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర హోంశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో జమియత్‌ రాష్ట్ర శాఖ కార్యదర్శి గుల్జార్‌ అహ్మద్‌ ఈ మేరకు  మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని మసీదుల నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో పోలీసు శాఖ అనుమతి తీసుకునే మైకులను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఇప్పటికీ తీసుకోని వారు తక్షణమే పోలీసుల అనుమతి కోరాలని కోరుతున్నానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల హక్కులను కాపాడేలా వ్యవహరిస్తున్నదని తెలిపారు. మసీదుల్లో మైకులు వాడకంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) అధినేత రాజ్‌ థాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. మే 3 నాటికి రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లను తొలగించాని మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చారు. అలా చేయనట్లయితే మసీదుల వద్ద తమ కార్యకర్తలు లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేస్తారని, వాటిలో హనుమాన్‌ చాలీసా వినిపిస్తారని హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)