కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 April 2022

కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.


రెండు రోజులుగా కొన్నిప్రాంతాల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ లీటర్ రూ. 120, డీజిల్ రూ. 100 దాటాయి. పెరుగుతున్న ధరలతో సొంత వాహనాలు వదిలి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్టితి నెలకొంది. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు న్యూఢిల్లీలో పెట్రోల్ రూ. 105.41 ఉండగా డీజిల్ రూ. 96.67గా ఉంది. కోల్ కత్తాలో పెట్రోల్ రూ. 115.12కాగా డీజిల్ రూ. 99.83గా ఉంది. ముంబాయి పెట్రోల్ లీటర్ రూ. 120.51, డీజిల్ రూ. 104.77గా ఉంది. అదేవిధంగా చెన్నైలో పెట్రోల్ ధరల రూ. 110.85కాగా డీజిల్ రూ. 100.94 గా ఉంది. నోయిడాలో పెట్రోల్ రూ. 13పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ లీటరు రూ. 105.60 చేరుకోగా, డీజిల్ రూ. 12పైసలు పెరిగి రూ. 97.15కు చేరుకుంది. బెంగళూరులో పెట్రోల్ రూ. 111.09 కాగా డీజిల్ లీటర్ రూ. 94.79గా ఉంది. అదేవిధంగా లక్నోలో పెట్రోల్ రూ. 3పైసలు పెరిగి రూ. 105.03కు చేరింది. డీజిల్ రూ. 2పైసలు పెరిగి రూ. 96.61కి చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 119.49 కాగా, డీజిల్ ధర రూ. 32పైసలు పెరిగి రూ. 107.42కు చేరింది. నిజామాబాద్ జిల్లాలో పెట్రొల్ లీటర్ రూ. 121కాగా, డీజిల్ రూ. 107.48 గా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ రూ. 07 పైసలు పెరిగి రూ. 121.25 కు చేరుకుంది. డీజిల్ రూ. 7పైసలు పెరిగి రూ. 106.86కు చేరుకుంది. గుంటూరులో పెట్రొల్ లీటర్ ధర రూ. 122.08 చేరుకోగా, డీజిల్ ధర రూ. 107.63కు చేరుకుంది.

No comments:

Post a Comment