పాడుబడిన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం !

Telugu Lo Computer
0


ఒడిశా లోని భువనేశ్వర్ లో గంజాం భంజనగర్ మైనర్ ఇరిగేషన్ విభాగంలో సహాయ ఇంజినీర్ గా కార్తికేశ్వర రవుళొ పని చేస్తున్నాడు. ఇతను భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని, అక్రమార్జన ఆరోపణలు వినిపించాయి. దీంతో విజిలెన్స్ అధికారులు అతను ఉంటున్న నివాసానికి చేరుకుని గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. విచారణలో అతనికి రెండో భార్య కల్పన ఉన్నట్లు తేలింది. ఆమెను విచారించారు. మొదటి భార్యకు తెలియకుండా కల్పనను వివాహం చేసుకున్నాడని నిర్ధారించారు. సోదరి సలియా సాహి బస్తీలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో ఆమె అక్కడ ఎందుకు నివాసం ఉంటుందని అధికారులు అనుమానించారు. అనంతరం ఆ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా రూ. 3.41 కోట్ల నగదు, 940 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. నగదును లెక్కించడానికి మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది. వెంటనే వాటిని  స్వాధీనం చేసుకున్నారు. కల్పనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)