ఆగని పెట్రో బాదుడు !

Telugu Lo Computer
0


దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. తగ్గేదే లే అన్నట్లుగా రోజువారీగా ఇంధన ధరలు దూసుకెళ్తున్నాయి. పెట్రోల్ లీటరు రూ. 120 మార్కును అందుకొనేందుకు పోటీ పడుతుండగా, అదేస్థాయిలో డీజిల్ ధర పెరుగుతుంది. నేడు ప్రధాన చమురు మార్కెట్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 80పైసలు చొప్పున పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.103.41 కాగా, డీజిల్ రూ.94.67కి చేరింది. మార్చి 22నుంచి నేటి వరకు 13రోజుల్లో 11 సార్లు ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ లీటర్ రూ. 118కి చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 118.15కు చేరగా, డీజిల్ లీటర్ రూ. 105.50కి చేరింది. విజయనగరంలో పెట్రోల్ రూ. 117.22, డీజిల్ రూ. 104.70గా ఉంది. మరోవైపు విశాఖపట్టణంలో పెట్రోల్ ధర రూ. 117.62కు చేరుకోగా, డీజిల్ ధర సెంచరీ దాటి లీటర్ రూ. 104.06కి చేరింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.13 కాగా డీజిల్ లీటర్ ధర రూ. 103.20కి చేరింది. ఖమ్మం జిల్లాలో పెట్రోల్ ధర రూ. 117.63కు చేరుకోగా, డీజిల్ 103.70కి చేరింది. కరీంనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ 117.31 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 103.41కు చేరింది. మెదక్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.13కు చేరుకోగా, డీజిల్ ధర లీటర్ రూ.103.66కు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)