రష్యాకు భారత్ ఎగుమతులు పునరుద్ధరణ

Telugu Lo Computer
0


రష్యాకు ఎగుమతులను భారత్ తిరిగి ప్రారంభించింది. టీ, బియ్యం, పండ్లు, కాఫీ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులతో కూడిన కంటైనర్‌లు రష్యాకు తరలి వెళ్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత వారం రోజులుగా భారత్ నుంచి ఈ ఉత్పత్తులు జార్జియా పోర్టు మీదుగా రష్యాకు ఎగుమతి అవుతున్నట్లు తెలిసింది. రష్యాలోని అతిపెద్ద రుణదాత అయిన స్బేర్‌బ్యాంక్ సహకారంతో రష్యా బ్యాంకులే ఈ దిగుమతుల చెల్లింపులు చేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ మరియు సీఈఓ అజయ్ సహాయ్ వెల్లడించారు. 22,000 కిలోల బరువు గల 60 కంటైనర్లలో సాధారణ బియ్యాన్ని ఇటీవలే భారత్ నుంచి రష్యాకు ఎగుమతి చేసినట్లు షా నంజీ నాగ్జీ ఎక్స్‌పోర్ట్స్ డైరెక్టర్ అశ్విన్ షా వెల్లడించారు. ఇందుకుగానూ రష్యాకు చెందిన ఆల్ఫా బ్యాంకు..తమకు చెల్లింపులు చేసిందని అశ్విన్ షా పేర్కొన్నారు. మరోవైపు రష్యాపై అంతర్జాతీయ వాణిజ్య సమాఖ్య ఆంక్షల ఫలితంగా..ఆదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ సంస్థలు మూతపడనున్నాయి. విదేశీ సంస్థలు కార్యకలాపాలు నిలిపివేస్తే సుమారు 2 లక్షల మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని మాస్కో నగర మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు సిటీ మేయర్ 41 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)