మళ్లీ మార్కెట్లోకి రానున్న ఎల్ఎంఎల్ మోటార్ సైకిల్స్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 April 2022

మళ్లీ మార్కెట్లోకి రానున్న ఎల్ఎంఎల్ మోటార్ సైకిల్స్


దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం లోహియా మెషినరీ లిమిటెడ్ (ఎల్ఎంఎల్) మోటార్ సైకిల్స్ సంస్థ తిరిగి మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 1990 – 2000 మధ్య కాలంలో బజాజ్ చేతక్ స్కూటర్ కి ధీటుగా స్కూటర్లను తయారు చేసిన ఎల్ఎంఎల్ భారతీయులకు సుపరిచితమే. ఇటలీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాగ్జియోతో కలిస్ భారత్ లో స్కూటర్లు, మోటార్ సైకిల్స్ తయారు చేసి మార్కెట్ ఎల్ఎంఎల్ సంస్థ చేసింది. అయితే అనుకోని కారణాలతో 2017లో మోటార్ సైకిల్ విభాగానికి స్వస్తి పలికిన ఎల్ఎంఎల్ సంస్థ, భారీ పరిశ్రమలకు విద్యుత్ పరికరాల తయారీ, ఇతర రంగాల్లో కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల దేశంలో విద్యుత్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన ఎల్ఎంఎల్ సంస్థ. ఆ విభాగంలో అడుగుపెట్టింది. రానున్న ఏడాది కాలంలో తమ సంస్థ నుంచి మూడు విద్యుత్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్ కోసం ఇప్పటికే “Detel” అనే విద్యుత్ వాహన సంస్థతో LML జతకట్టింది. LML Electric పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఉమ్మడి సంస్థకు “SG Corporate Mobility” మాతృ సంస్థగా నిలవనుంది. 2024 నాటికి LML ఎలక్ట్రిక్ బ్రాండ్ పై మూడు మధ్యశ్రేణి, ఒక ప్రీమియం రేంజ్ విద్యుత్ వాహనాలను భారత్ లో విడుదల చేయనున్నట్లు ఎల్ఎంఎల్ సంస్థ వెల్లడించింది.

No comments:

Post a Comment