భారత్ గగనతలంలో పేలిన చైనా రాకెట్

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శనివారం రాత్రి కాంతి పుంజం కనిపించడంతో చూసినవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది ఉల్కాపాతం అని భావించారు. కానీ ఇది చైనీస్ రాకెట్ చాంగ్ జహేంగ్ 5 బి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు పేలిపోవడంతో వెలువడిన కాంతి అని ఓ అమెరికన్ సైంటిస్ట్ చెప్తున్నారు.  చాంగ్ జహేంగ్ 5 బి సిరీస్ రాకెట్‌ను 2021 ఫిబ్రవరిలో ప్రయోగించారు. ఇది శనివారం భూమి వాతావరణంలోకి మళ్ళీ ప్రవేశించింది. భారత దేశ గగనతలంలో పేలిపోయింది. ఈ రాకెట్ శిథిలాల్లో అత్యధిక భాగం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నపుడే మండిపోయాయి. దీనివల్ల హాని జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది. హార్వర్డ్-స్మిత్‌ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌ ఆస్ట్రోనామర్ జొనాథన్ మెక్‌డొవెల్ అంతకుముందు ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రాకెట్ బాడీ శనివారం క్రిందకు వస్తుందని ముందుగానే ఊహించారు. ఈ రాకెట్ రీఎంట్రీ స్టేజ్‌గా తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. చాంగ్ జహేంగ్ 5 బి రాకెట్ మూడో దశ అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇది మరో గంటలో తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ట్రాక్ కూడా చాలా బాగుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)