సీఎం నితీశ్ సభలో బాంబు దాడి ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 April 2022

సీఎం నితీశ్ సభలో బాంబు దాడి ?


బీహార్ లోని నలందాలో సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో బాంబు దాడి జరిగింది.  సీఎం నితీశ్ ఉన్న ప్రాంతానికి కేవలం 18 అడుగుల దూరంలోనే ఈ దాడి జరగడం కలకలం రేపింది. మరో వైపు పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది బాంబు దాడి కాదని.. కొందరు వ్యక్తులు టపాకాయలు పేల్చారన్నది మరో వాదన. ఇస్లాంపూర్ సత్యర్ గంజ్‌కు చెందిన ఓ వ్యక్తి టపాకాయలు కాల్చారన్నది వారి వాదన. ఏది ఏమైనా సీఎం నితీశ్ పాల్గొన్న సభలో, అది కూడా ఆయనకు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు సీఎం నితీశ్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. భక్తియార్ పూర్‌లో ఈ ఘటన జరిగింది. సీఎం నితీశ్ ఓ విగ్రహానికి పూల మాల వేస్తుండగా, సెక్యూరిటీని తప్పించుకొని, ఓ యువకుడు సీఎం నితీశ్‌ను వెనకనుంచి దాడి చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయి, ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment