విదేశీ రుణాలు కొంత కాలం చెల్లించలేం

Telugu Lo Computer
0


అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక విదేశీ రుణాలను కొంత కాలంపాటు తిరిగి చెల్లించలేమని మంగళవారం ప్రకటించింది. తమకు అప్పులిచ్చిన రుణదాతలు, విదేశీ ప్రభుత్వాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి వడ్డీ బాకీలను అసలు రుణంలో కలుపుకోవాలని తెలిపింది. లేదంటే శ్రీలంక కరెన్సీలో తిరిగి పొందవచ్చునని పేర్కొంది. శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 51 బిలియన్ డాలర్ల మేరకుగల ప్రభావిత రుణాల సాధారణ రుణ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మద్దతుగల ఆర్థిక సర్దుబాటు పథకానికి అనుగుణంగా ఈ రుణాలను క్రమబద్ధమైన, పరస్పర సమ్మతితో కూడిన పునర్వ్యవస్థీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. 2022 ఏప్రిల్ 12నాటికి బాకీ ఉన్న ''ప్రభావిత రుణాల''కు ప్రభుత్వ విధానం వర్తిస్తుందని తెలిపింది. ఈ తేదీ తర్వాత నూతన రుణ సదుపాయాలు, అదేవిధంగా ప్రస్తుత రుణ సదుపాయాల ప్రకారం విడుదలైన మొత్తాలకు ఈ విధానం వర్తించదని, వీటికి మామూలుగానే సేవలందిస్తామని వివరించింది. రుణదాతల పరిశీలన కోసం ఓ రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్‌ను సమర్పించే వరకు అన్ని ప్రభావిత రుణాల దాతలు ఈ మధ్యంతర కాలంలో తమకు రావలసిన అసలు, వడ్డీ సొమ్మును అసలులో కలుపుకోవాలని తెలిపింది. సంబంధిత రుణానికి వర్తించే సాధారణ కాంట్రాక్చువల్ రేటుకు మించని వడ్డీ రేటును వర్తింపజేసుకోవాలని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)