ధరల పెరుగుదలలో హెచ్చుతగ్గులు

Telugu Lo Computer
0


గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈరోజు ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.49 కాగా, డీజిల్ పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. వరంగల్‌లో పెట్రోల్ ధర నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.105.02 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 3 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.119.18 కాగా, డీజిల్‌పై 3 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.67 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఇంధన ధరలుపెరిగాయి. నేడు కరీంనగర్‌లో 30 పైసలు పెరిగి, పెట్రోల్ ధర రూ.119.64 కాగా, 13 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.36కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పెట్రోల్‌పై 75 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.121.81 కాగా, ఇక్కడ డీజిల్ పై 70 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.38 కి చేరింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. 81 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 77 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.106.42గా ఉంది. చిత్తూరులో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ లీటర్ రూ.122.07 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.107.57 అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)